»Amul Makes History Become First Dairy Now Sells Indian Brand Fresh Milk In America
Amul : చరిత్ర సృష్టించిన అమూల్ పాలు
అమూల్ దూద్ పీతా హై ఇండియా... కాదు కాదు, ఇప్పుడు భారతదేశ ప్రజలే కాదు, అమెరికా ప్రజలు కూడా ఈ పాట పాడతారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా కూడా అమూల్ బ్రాండ్ పాలను ఆనందంగా తాగుతుంది.
Amul : అమూల్ దూద్ పీతా హై ఇండియా… కాదు కాదు, ఇప్పుడు భారతదేశ ప్రజలే కాదు, అమెరికా ప్రజలు కూడా ఈ పాట పాడతారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా కూడా అమూల్ బ్రాండ్ పాలను ఆనందంగా తాగుతుంది. దీంతో అమూల్ బ్రాండ్ యజమాని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అమెరికాలో భారతీయ డెయిరీ బ్రాండ్‌కి ఇదే తొలి ప్రవేశం. భారతదేశంలో రోజుకు లక్షల లీటర్ల తాజా పాలను సరఫరా చేసే అమూల్ బ్రాండ్ ఇప్పుడు అమెరికాలోనూ తన సత్తా చాటబోతుంది. అమూల్ బ్రాండ్ ఇక్కడ తాజా పాల విభాగంలో పని చేస్తుంది.
గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) అమెరికాలో అమూల్ బ్రాండ్ పాలను విక్రయించడానికి అమెరికాకు చెందిన 108 ఏళ్ల డెయిరీ ‘మిచిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’తో ఒప్పందం కుదుర్చుకుంది. GCMMF మేనేజింగ్ డైరెక్టర్ జాయెన్ మెహతా సహకార వార్షిక సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. అమూల్ బ్రాండ్ యొక్క తాజా పాల శ్రేణిని భారతదేశం వెలుపల అమెరికా వంటి మార్కెట్లలో విడుదల చేయడం ఇదే మొదటిసారి. అమెరికాలో భారతీయ సంతతికి చెందిన అధిక జనాభా ఉంది.