6-12 తరగతి విద్యార్థులకు కేంద్రం మంచి అవకాశం కల్పించింది. ‘వికసిత్ భారత్ బిల్డ్ థాన్-2025’ పేరుతో అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. విద్యార్థుల వివరాలను VBB.MIC.GOV.INలో నమోదు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన నాలుగు థీమ్‌లలో ఒకదాన్ని ఎంచుకుని సమస్యకు విభిన్న పరిష్కారం చూపుతూ 2-5 నిమిషాల నిడివితో వీడియో తీసి పంపించాలి. విజేతలకు రూ. కోటి బహుమతి ఇస్తారు.