ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ వీ60 ప్రో ఫోన్ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ 45వాట్ల చార్జింగ్ మద్దతుతో 5600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో పనిచేస్తుంది. త్వరలో భారత్ మార్కెట్లోకి రానుంది. 12GB ర్యామ్ విత్ 256 జీబీ వేరియంట్ రూ.18,600 (1599 చైనా యువాన్లు), 12GB ర్యామ్ విత్ 512 GB వేరియంట్ దాదాపు రూ.21 వేలు (1799 చైనా యువాన్లు) పలుకుతుంది.