»108 Cm Iffalcon Tv For Rs 17 999 Only On Flipkart Big Billion Days Sale 2023
Flipkart: రూ.17 వేలకే 108cm టీవీ..ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ షురూ
ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 8వ తేదీన మొదలు కాగా..అక్టోబర్ 15 వరకు కొనసాగనుంది. మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ సహా అనేక రకాల ఉత్పత్తులపై కొన్ని అదిరిపోయే డిస్కౌంట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అవెంటో ఓసారి లుక్కేయండి మరి.
108 cm iFFALCON TV for Rs 17 999 only on Flipkart Big Billion Days Sale 2023
ఫ్లిప్కార్ట్బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 అక్టోబర్ 8న ప్రారంభమైంది. ఈ సేల్ అక్టోబర్ 15 వరకు కొనసాగుతుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్లెస్ ఇయర్ఫోన్లు, ఇతర సాంకేతిక ఉపకరణాలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్టులో మొబైల్ ఫోన్లు అత్యంత తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపును అందజేస్తున్నారు. స్మార్ట్ వేరబుల్స్, బ్లూటూత్ హెడ్ఫోన్లు రూ.799, రూ.499 నుంచి మొదలయ్యాయి. మీరు టాబ్లెట్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే ఫ్లిప్‌కార్ట్ 70 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది. ఇక మానిటర్ల విషయానికొస్తే ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ 70 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. 4K టీవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే Flipkart 4K స్మార్ట్ టీవీలపై 75 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తుంది.
ఎంపిక చేసిన కోటక్ బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా Flipkart 10 శాతం తగ్గింపును ప్రకటించింది. అదనంగా కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఐదు శాతం అదనపు తగ్గింపును పొందవచ్చు. ఇంకా నో-కాస్ట్ EMI ఎంపికలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ల తర్వాత iPhone 14 రూ.52,999కి అందుబాటులో ఉంది. iPhone 12, iPhone 13 Pro Max, iPhone 14 Proపై లాభదాయకమైన తగ్గింపులు కూడా ఉన్నాయి.
మరోవైపు iFFALCON 108 cm(43 inch) Ultra HD (4K) LED Smart Google TV మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. దీని అసలు ధర రూ.49,990 ఉండగా ప్రస్తుతం 63 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.17,999కేఅందుబాటులో ఉంది. అద్భుతమైన మల్టీమీడియా సపోర్ట్ క్వాలిటీతో HDR ఫంక్షన్, డైనమిక్ కలర్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీతో లభిస్తుంది. దీని రిజల్యూషన్: అల్ట్రా HD (4K) 3840 x 2160 పిక్సెల్స్, సౌండ్ అవుట్‌పుట్: 24W, రిఫ్రెష్ రేట్: 60 Hz, ఆపరేటింగ్ సిస్టమ్: Google TV, Netflix|ప్రైమ్ వీడియో|Disney+Hotstar|Youtube వంటి యాప్స్ కు కూడా సపోర్ట్ చేయనుంది.