చైనా ఆన్లైన్ గేమింగ్ యాప్‌పై ఈడీ చర్యలు చేపట్టింది. FIEWIN యాప్‌తో అనుసంధానించిన క్రిప్టో ఖాతాలను ఫ్రీజ్ చేసింది. రూ.25 కోట్లు విలువైన క్రిప్టో ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసినట్లు తెలిపింది. గేమింగ్ యాప్ ద్వారా ఇండియా నుంచి చైనాకు దాదాపు నాలుగు వందల కోట్లు చేరినట్లు గుర్తించిన ఈడీ.. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది.