NDL: శ్రీశైలం మండలం సున్నిపెంట ఫిష్ మార్కెట్ సమీపంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చిరుత పులి 4 కుక్క పిల్లలపై దాడి చేసింది. రెండింటిని చంపేసి, ఒక పిల్లను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. శివారు ప్రాంతాలలో చిరుతపులుల సంచారం పరిపాటిగా మారిందని అంటున్నారు. రాత్రి వేళలో తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని చెబుతున్నారు.