KDP: పెండ్లిమర్రి మండలంలోని పుణ్యక్షేత్రమైన పొలతలకు దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. అదే మండలంలోని కొత్తపేటకు చెందిన మిథున్ రెడ్డి సోమవారం దైవదర్శనం చేసుకోని అనంతరం బైకులో తిరిగి బయలుదేరాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ను దాటి ముందుకు వెళుతూ అదుపుతప్పి కింద పడ్డ అతనిపై ట్రాక్టర్ ఎక్కడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు.