ప్రకాశం: కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి ఒంగోలు వైపు వెళుతున్న లారీ చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ దగ్గరకు వచ్చేసరికి ముందు ఆగి ఉన్న మరొక లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో ఇద్దరు డ్రైవర్లు ఉండగా సుధాకర్ అనే డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.