TG: హైదరాబాద్, రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన వారిని అరెస్ట్ చేశారు. రూ. 600 కోట్లు విలువచేసే 12.9 ఎకరాల భూమిని కాజేసేందుకు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి రిజిస్టర్ చేసుకోవడానికి ముఠా ప్రయత్నించింది. నిందితులకు ఇన్ఛార్జ్ అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. శేరిలింగంపల్లి తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.