కృష్ణా: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మచిలీపట్నం వైపు వెళ్తున్న ఆటో బోల్తా కొట్టడంతో విజయవాడ బాంబే కాలనీ చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న గూడూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.