AP: YSR జిల్లా బద్వేలు సమీపంలో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధిత బాలికకు విఘ్నేష్ అనే వ్యక్తితో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అతడికి పెళ్లి కాగా, భార్య గర్భిణీ. ఈ క్రమంలో బాలికను కలవాలని విఘ్నేష్ ఒత్తిడి తెచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం ఇద్దరూ కలవడంతో.. పీపీకుంట చెక్ పోస్టు వద్దకు తీసుకెళ్లి నిప్పంటించి పరారయ్యాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.