TG: జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి దారుణహత్యకు గురయ్యారు. సంతోష్ అనే వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీకొట్టి, కత్తితో పొడిచి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ‘సోదరుని లాంటి వ్యక్తిని కోల్పోయాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీ నేతలకు రక్షణ కరువైంది. పక్కా ప్రణాళికతో అతనిపై హత్య చేశారు’ అని మండిపడ్డారు.