అమెరికాలోని సెంట్రల్ మిస్సిస్సిప్పిలో వందలాది వ్యక్తుల సమూహంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. ఎనిమిది మంది గాయపడ్డారు. పాఠశాల హోమ్ ఫుట్బాల్ విజయోత్సవ సంబరాల్లో ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈవెంట్కు హాజరైన కొందరు వ్యక్తుల మధ్య గొడవ జరిగిన తర్వాత కాల్పులు జరిగాయని సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.