»Wash Your Face With Dettol Nirmala Sitharaman Suggest To Congress Mps
Dettol తో మీ నోళ్లు కడుక్కోండి: కాంగ్రెస్ కు మంత్రి నిర్మల చురక
అవినీతి (Corruption) గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. మీరు మీ నోళ్లను డెటాల్ (Dettol) తో శుభ్రం చేసుకోండి భయ్యా. ఒకవేళ అలా చేసినా మీ నోళ్లు శుభ్రం కావు’ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ (Union Budget)ను నిర్మలా ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని ప్రతిపక్షాలు విమర్శించాయి.
గౌతమ్ అదానీ కుంభకోణం (Gautam Adani Scam) భారత పార్లమెంట్ (Parliament) ను కుదిపేస్తోంది. అదానీ కుంభకోణంపై జేపీసీ వేయాలని ప్రతిపక్షాలు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాల ఆందోళనను ఎగతాళి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాట్లాడుతున్నాడు. అయితే పార్లమెంట్ వేదికగా జబ్బాలు చరచుకుని మాట్లాడిన మోదీ గౌతమ్ అదానీ అంశంపై నోరు మెదపకపోవడం గమనార్హం. కాగా ఈ అంశంపై మోదీ స్పందించకున్నా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) స్పందించారు. కాంగ్రెస్ (Congress)తో పాటు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కూడా ఆందోళనలు చేపడుతుండడంతో ప్రతిపక్ష పార్టీలపై నిర్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీని విమర్శించిన మీరు మీ నోళ్లను డెటాల్ తో శుభ్రం చేసుకోవాలని హితవు పలికారు.
అదానీ వ్యవహారం శుక్రవారం కూడా పార్లమెంట్ స్తంభించింది. ఆందోళనల మధ్యనే చర్చలు కొనసాగాయి. ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ మాట్లాడుతూ.. కుటుంబ బంధాన్ని మేలు చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని తెలిపారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం యావత్ దేశాన్ని దృష్టిలో ఉంచుకునే విధానాలను రూపొందిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ జిజాజీలు, భతీజాల పార్టీ కాదని స్పష్టం చేశారు. ఒక వ్యక్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం బడ్జెట్ రూపొందించిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై నిర్మల స్పందిస్తూ.. ‘ఎవరినో దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు చెప్పడం తప్పు. మోదీ హయాంలో తాము నిధుల కేటాయింపులు ఏ ఒక్కరినీ కాకుండా మొత్తం దేశాన్ని దృష్టిలో ఉంచుకుని చేశాం. అవినీతి (Corruption) గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. మీరు మీ నోళ్లను డెటాల్ (Dettol) తో శుభ్రం చేసుకోండి భయ్యా. ఒకవేళ అలా చేసినా మీ నోళ్లు శుభ్రం కావు’ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు.
పెట్రోల్ ధరలు పెరగడంపై ఉల్టా కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా పెరిగిన ధరలను పట్టించుకోకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ప్రస్తావన తీసుకువచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హిమాచల్ ప్రదేశ్ లో పెట్రోల్ ధరలు పెరిగాయని నిర్మల ఆరోపించారు. దీనికి బదులుగా కాంగ్రెస్ నాయకులు ‘మరి దేశవ్యాప్తంగా ధరలు పెరగడానికి కారణం ఎవరు?’ అని ఎదురు ప్రశ్నించారు. ఇక రాజస్థాన్ అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనను నిర్మల లోక్ సభలో ప్రస్తావించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ పొరపాటున గతేడాదికి సంబంధించిన బడ్జెట్ ను అసెంబ్లీలో చదివారు. ఈ సంఘటనను నిర్మల ప్రస్తావిస్తూ.. ‘రాజస్థాన్ కష్టాల్లో ఉంది. తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ గతేడాదికి సంబంధించినది చదవాల్సిన పరిస్థితి ఎవరికీ రాకుండా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని నిర్మల వ్యంగ్యంగా చెప్పారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ (Union Budget)ను నిర్మలా ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఒక్క రంగానికి కూడా మోదీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.