»Siddaramaiah Is Almost Finalized As The New Cm Of Karnataka
Karnataka CM:గా సిద్ధరామయ్య దాదాపు ఖరారు
మూడు రోజుల నిరీక్షణ తర్వాత కర్ణాటక తన తదుపరి ముఖ్యమంత్రి(karnataka cm) నిర్ణయం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య(Siddaramaiah) వైపే పార్టీ హై కమాండ్ మొగ్గుచూపిందని తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధికారికంగా ఈరోజు సాయంత్రం ప్రకటిస్తారని భావిస్తున్నారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య(Siddaramaiah) కర్నాటక తదుపరి ముఖ్యమంత్రిగా భాధ్యతలు చేపట్టబోతున్నారని తెలుస్తోంది. మరో అగ్రనేత డీకే శివకుమార్(dk shivakumar)కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర కేబినెట్లో ఆయనకు ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలు వచ్చే అవకాశం ఉందని ఆయా వర్గాలు తెలిపాయి. సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం గురువారం జరిగే అవకాశం ఉంది. మొత్తం 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం గురువారం జరగనుంది. ఈ క్రమంలో ఈరోజు సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరూ ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని వేర్వేరుగా కలిశారు.
మే 10న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 135 స్థానాలను కైవసం చేసుకుని బీజేపీని అధికారం నుంచి దింపిన కాంగ్రెస్(congress party) అఖండ విజయం సాధించింది. బీజేపీ 66 సీట్లతో రెండో స్థానంలో నిలవగా, కింగ్‌మేకర్‌గా బరిలోకి దిగాలని భావించిన జేడీ(ఎస్) కేవలం 19 సీట్లకే పరిమితమైంది. అప్పటి నుంచి కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిని నియమించడం కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారింది.
సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం జి పరమేశ్వర సహా కాంగ్రెస్‌లోని ఇతర సీఎం(CM) ఆశావహులు కూడా ఈ పదవి కోసం పోటీ పడ్డారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కేంద్ర పరిశీలకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఇద్దరు ప్రధాన పోటీదారులు శివకుమార్, సిద్ధరామయ్యతో సహా పార్టీ నేతలతో ఖర్గే మంగళవారం పలు సమావేశాలు నిర్వహించారు.