»Rishi Sunak Enters The Field To See The End Of British Pakistani Grooming Gangs
Rishi Sunak: బ్రిటన్ పాకిస్తానీల అంతు చూసేందుకు…రంగంలోకి రిషి సునాక్
యువతులు, మహిళలను లైంగికంగా వేధిస్తున్న గ్రూమింగ్ గ్యాంగ్స్ ఆగడాలను కట్టడి చేసేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) కఠిన చర్యలు చేపడుతున్నారు. వారిని అణచి వేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్(Taskforce) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అరచాలకు పాల్పడుతున్న బ్రిటన్ పాకిస్తానీయులను అరెస్టు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
బ్రిటన్ దేశంలో గ్రూమింగ్ గ్యాంగ్స్(grooming gangs) పేరు ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ గ్యాంగ్స్ ప్రధానంగా బ్రిటన్ లోని యువతులతోపాటు మహిళలను లైంగికంగా వేధిస్తున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంటోపాటు ఈ అంశంపై అక్కడి హోం మంత్రి సుయోలా బ్రావెర్మన్ స్వయంగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. బ్రిటిష్ పాకిస్తాన్ పురుషులు గ్యాంగులుగా ఏర్పడి అనేక ఆగడాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ గ్రూపుల విషయంలో గతంలో అనేక రాజకీయ పార్టీలు పట్టించుకోలేదని ఆరోపించారు.
అయితే ఇది తెలిసిన భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) గ్రూమింగ్ గ్యాంగ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యూకేలో పిల్లలను, యువతను వేధించే గ్రూమింగ్ గ్యాంగ్లను అణచివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు ప్రత్యేక టాస్క్ ఫోర్స్(Taskforce)ను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు గతంలో రాజకీయ మద్దతు కోసం ఈ గ్యాంగ్స్ అక్రమాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. కానీ తమకు అలాంటివి అవసరం లేదని స్పష్టం చేశారు.
I will do whatever it takes to root out grooming gangs once and for all.
లైంగిక నేరస్థులు అరెస్టు నుంచి తప్పించుకోకూడదని సునక్ అన్నారు. ఈ క్రమంలో గ్రూమింగ్ గ్యాంగ్(grooming gangs)లను రూపుమాపడానికి ఏం చేయడానికైనా సిద్ధమేనని వెల్లడించారు. మరోవైపు 2020 నాటి అధికారిక హోం ఆఫీస్ నివేదిక ప్రకారం 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న శ్వేతజాతీయుల పిల్లలు ఈ ముఠాల ద్వారా లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
అసలు గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే ఏమిటి?
బ్రిటన్లో నేషనల్ సోసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టూ చిల్డ్రన్ నివేదిక ప్రకారం పిల్లలు, యువతులను గుర్తు తెలియని పురుషులతో సంబంధాలు పెట్టుకునేలా చేయడమే ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ లక్ష్యం. ఆ క్రమంలో గ్రూమింగ్ ముఠాలు “ప్రేమికుడు-అబ్బాయి” పథకాన్ని ఉపయోగించి మహిళలను ఆకర్షిస్తారు. తర్వాత వారిని బలవంతంగా లైంగింక పనులకు ఉపయోగిస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ పలు రకాల అక్రమాలకు పాల్పడుతుంటారు. అయితే వీరు ఎక్కువగా అనాథలు, మాదకద్రవ్యాల బానిసలు, నిర్లక్ష్యం చేయబడిన లేదా గృహ హింసకు గురవుతున్న పిల్లలను లక్ష్యంగా చేసుకుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ కల్చర్ మరింత పెరింగిందని ఆన్ లైన్ ద్వారా ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ మరింత ఎక్కువ మంది యువతులను(young womens) ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని వెలుగులోకి వచ్చింది.