అంపైరింగ్ పైన నోరు జారిన రాజస్థాన్ రాయల్స్ ((Rajasthan Royals) ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Rajasthan Royals’ star spinner Ravichandran Ashwin) పైన చర్యలు తీసుకున్నారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ( breaching IPL Code of Conduct) ఉల్లంఘించారంటూ భారీ జరిమానా విధించారు. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. చెన్నై సూపర్ కింగ్స్ తో (chennai super kings) జరిగిన మ్యాచ్ సమయంలో మంచు కారణంగా అంపైర్ బంతిని మార్చడాన్ని తప్పుబట్టాడు. ఇది జరిమానాకు కారణమైంది. లక్ష్య ఛేదనలో అంపైర్ బంతిని మార్చడం ఆశ్చర్యం కలిగించిందని మ్యాచ్ అనంతరం అశ్విన్ (Ravichandran Ashwin) అన్నాడు. మంచు కారణంగా అంపైర్లు బంతి మార్చడం తనకు ఆశ్చర్యం వేసిందని, ఇలా ఇదివరకు ఎప్పుడు జరగలేదని చెప్పాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో (IPL) అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు తనను అయోమయానికి గురి చేశాయన్నాడు. అంపైర్లు ఎప్పుడైనా సమతూకం పాటించాలన్నాడు. బౌలింగ్ జట్టుగా బంతిని మార్చాలని తాము కోరుకోలేదని, కానీ అంపైర్లు సొంతగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. బంతిని మార్చడంపై తాము అంపైర్లను అడిగితే… బంతిని మేమూ మార్చవచ్చునని చెప్పారని అన్నాడు. ఈ ఐపీఎల్ లో ఎప్పుడు మంచు ఉన్నా అంపైర్లు బంతి మారుస్తారనే తాను భావిస్తున్నానని చెప్పాడు. ఏ నిర్ణయాలు తీసుకున్నా.. ఒకేలా.. నిలకడగా ఉండాలన్నాడు.
రెండు రోజుల క్రితం చెన్నై – రాజస్థాన్ (chennai super kings – rajasthan royals) మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ చేజింగ్ సమయంలో మంచు కురిసింది. ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకొని తమకు తాముగా బంతిని మార్చాలని నిర్ణయించారు. ఈ మ్యాచ్ లో అశ్విన్ 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. ప్రారంభ ఓవర్లలో ఛేదనలో చెన్నై వెనుకబడింది. అయితే ఆ తర్వాత దూకుడుగా ఆడటంతో మ్యాచ్ చెన్నై పరమవుతుందని అందరూ భావించారు. చెన్నై గెలవాలంటే చివరు ఓవర్లో 21 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో క్రీజులో ధోనీ, జడెజా ఉన్నారు. ధోనీ ఉండటంతో చెన్నై అభిమానులు గెలుస్తామనే ఆశలతో ఉన్నారు. అయితే మూడు పరుగుల తేడాతో రాజస్థాన్ గెలిచింది. చివరి బంతికి కూడా సిక్స్ కొడితే గెలిచే పరిస్థితుల్లో విఫలమయ్యారు.
ఇదిలా ఉండగా, మొహాలీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ – గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ ఉత్కంఠ భరిత విజయం సాధించింది. తొలుత పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేయగా, ఆ తర్వాత గుజరాత్ ఈ లక్ష్యాన్ని చేధించేందుకు చెమటోడ్చింది. 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. శుభ్ మన్ గిల్ 49 బంతుల్లో 67 పరుగులు చేశాడు.