Rahul Dravid: WTC ఫైనల్ గెలిచేందుకు ఎలాంటి ఒత్తిడి లేదు
ఐసీసీ ట్రోఫీని గెలవడానికి ప్రయత్నించే విషయంలో మాకు ఎలాంటి ఒత్తిడి లేదని భారత ప్రధాన కోచ్ అయిన ద్రవిడ్(Rahul Dravid) పేర్కొన్నారు. ఐసీసీ(icc) టోర్నీని గెలవడం కచ్చితంగా సంతోషమే. ఫైనల్ రావడం టీమిండియా రెండేళ్ల కష్టానికి ఫలితమని పేర్కొన్నారు. ఇక రేపటి నుంచి మొదలు కానున్న ఈ టోర్నీలో ఎవరు రాణిస్తారో చూడాలి.
భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ఐసిసి WTC ఫైనల్(WTC final 2023) ట్రోఫీని గెలుచుకోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుకు ఎటువంటి ఒత్తిడిలో లేదని పేర్కొన్నారు. రేపు(జూన్ 7న) లండన్‌లోని ఓవల్‌లో ప్రారంభమయ్యే రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ మీడియాతో మాట్లాడిన ద్రవిడ్..ఇండియా గెలవడం ఖాయామని అభిప్రాయం వ్యక్తం చేశారు. WTCలో(2021 నుంచి 2023 వరకు) భారత్ అద్భుతమైన ఆటతీరు కొనసాగించినట్లు తెలిపారు. ఇందులో ఆస్ట్రేలియా వంటి కొన్ని అగ్రశ్రేణి జట్లను స్వదేశంలో ఓడించడంతోపాటు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుందని గుర్తు చేశారు.
గత 10 సంవత్సరాలలో ఇండియా ఐసీసీ టైటిల్‌ను గెలుచుకోకపోవచ్చు. కానీ గత రెండేళ్లుగా తమ జట్టు కృషి కారణంగానే ఫైనల్ వరకు వచ్చామన్నారు. 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి WTC ఫైనల్లో భారత్ ఓడిపోయింది. అయితే ఈసారి మాత్రం పాజిటివ్ అంశాలతో ముందుకువెళ్తామన్నారు. ఇండియా గెలుస్తుందని వ్యాఖ్యానించారు. భారత ప్రధాన కోచ్ అయిన ద్రవిడ్ శక్తివంతమైన ఆసీస్‌ను ఎలా ఓడించాలి, ICC ట్రోఫీ ఎలా గెల్చుకోవాలనే దానిపై ఒక కీలకమైన ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు తనను తాను నిగ్రహించుకున్న ద్రవిడ్ ఈ పోటీని హైప్ చేయకుండా తన ఆటగాళ్లు అన్ని విభాగాల్లో డెలివరీ చేస్తారని పేర్కొన్నాడు.
ఏం జరిగినా వచ్చే 5 రోజుల్లోనే జరుగుతుందన్నారు. ఎవరు కాదన్నా… ఈ రెండు మంచి జట్లు ఆడనున్నాయని, జట్లకు కొంతమంది మంచి ఆటగాళ్లున్నారు. మనం మంచి క్రికెట్ ఆడితే, పరుగులు తీయగలిగితే విజయం సాధించగలమనే విశ్వాసం ఉందన్నారు. బహుశా హైప్ లేకపోవడమే మంచి విషయమని ద్రవిడ్ చెప్పాడు. ఇక ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రెండో ఎడిషన్ జూన్ 7 నుంచి 11 వరకు ది ఓవల్, లండన్ వేదికగా ఆస్ట్రేలియా, ఇండియా జట్ల మధ్య జరగనుంది.