• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

చికిత్స పొందుతూ 108డ్రైవర్ మృతి

కడప: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని రవీంద్రనగర్‌కు చెందిన ఎస్.రమేష్ గురువారం కడప-రాయచోటి మార్గంలో గల గువ్వల చెర్వు ఘాట్‌లో 108 వాహనం బ్రేక్ ఫెయిల్ అయ్యి వాహనం అదుపు తప్పి పడిపోయాడు. తీవ్రగాయలు కావడంతో జిల్లాలోని జగదీష్ న్యూరో హాస్పిటల్‌లో సర్జరీ జరిగింది. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. ఈ మరణవార్తతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

December 6, 2024 / 09:27 AM IST

10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

SKLM: ఎచ్చెర్ల మండలం ఎస్ఎన్ పురంలో ఏపీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి గురువారం అర్ధరాత్రి భవనంపై ఉరేసుకున్న ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఉరికి వేలాడుతూ ఉన్న మృతదేహాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు గమనించారు. ఎస్ఐ సందీప్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 6, 2024 / 09:26 AM IST

కొజ్జరిగూడలో జీప్ బోల్తా

ASR: పెదబయలు మండలం కొజ్జరిగూడలో శుక్రవారం ఓ జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగలేదు. నిర్మాణంలో ఉన్న కల్వర్టు డైవర్షన్ రహదారిలో వర్షాలకు రోడ్డు దిగిపోయి జీపు బోల్తా పడింది. జీప్‌లో ఉన్న డ్రైవర్ ముందుగా దూకేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. చిత్రకొండలో ఓ కుటుంబ సభ్యులను డ్రాప్ చేసి తిరిగి అరకు వెళుతుండగా జీపు బురదలో జారి ప్రమాదానికి గురైంది.

December 6, 2024 / 09:23 AM IST

ప్రమాద భరితంగా సిమెంట్ రోడ్డు మార్జిన్

కృష్ణా: నూజివీడు ఎంప్లాయిస్ కాలనీలోని చిల్డ్రన్స్ పార్క్ సిమెంట్ రోడ్డు మార్జిన్ లేక ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో నిత్యం స్కూల్ బస్సులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. సిమెంట్ రోడ్డుకు మార్జిన్ లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఇద్దరు విద్యార్థులు సైకిల్‌పై వెళ్తూ పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయారు.

December 6, 2024 / 08:10 AM IST

గుర్తుతెలియని జంతువు దాడిలో గొర్రె పిల్లలు మృతి

SKLM: పలాస మండలం నీలావతి గ్రామ సమీప తోటల్లో మాకన్నపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు కొన్ని రోజులుగా మందలు వేస్తున్నారు. గురువారం సాయంత్రం వంటకు అవసరమైన సరుకులు తెచ్చేందుకు గ్రామానికి వెళ్లగా గుర్తు తెలియని జంతువు దాడి చేసి సుమారు 25 గొర్రె పిల్లలను చంపివేసింది. గ్రామం నుంచి తిరిగి వచ్చిన గొర్రెల కాపరులు మద్దిల లచ్చయ్య కన్నీరు పెట్టుకున్నారు.

December 6, 2024 / 08:02 AM IST

టీడీపీ ఆఫీస్‌పై దాడి.. కొనసాగుతున్న అరెస్టులు

AP: కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 10 మంది రిమాండ్‌లో ఉండగా.. మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వారిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. ప్రధాన నిందితుడు కాళీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 6, 2024 / 08:01 AM IST

హత్య కేసు ముగ్గురు నిందితుల అరెస్టు

KRNL: గతనెల 27న రాంపల్లిలో జరిగిన శారద హత్య కేసులో నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పత్తికొండ సీఐ పులిశేఖర్, తుగ్గలి ఎస్సై కృష్ణమూర్తితో కలిసి వివరాలు వెల్లడించారు. హత్యకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టిగా, భార్యపై అనుమానంతో భర్త ఏకాశి రామానాయుడు, మద్దికెర లాలప్ప సహకారంతో కత్తితో పొడిచి హత్య చేశారని తెలిపారు. 

December 6, 2024 / 08:00 AM IST

ఫ్రైడ్ రైస్ తినేందుకు వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు

కృష్ణా: నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంలో ఫ్రైడ్ రైస్ తినేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదానికి గురైన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ తింటున్న ఓ వ్యక్తిపైకి వేగంగా వచ్చిన లారీ కాళ్లపై నుంచి వెళ్లడంతో, రెండు కాళ్లు విరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న నూజివీడు రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని పరిశీలించారు.

December 6, 2024 / 07:59 AM IST

ఇన్స్టా పరిచయం.. మోసపోయిన బెజవాడ మహిళ

విజయవాడకు చెందిన ఓ మహిళ ఆర్మీలో పనిచేసే వ్యక్తి చేతిలో మోసపోయారు. మురళీనగర్‌కు చెందిన మహిళ (45)కు పశ్చిమబెంగాల్‌లోని ఆర్మీలో పనిచేసే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈక్రమంలో అతని పిలుపు మేరకు ఆమె అక్టోబర్ 8న పశ్చిమ బెంగాల్ వెళ్లారు. అప్పుడు అతనికి రూ. 8లక్షలు ఇచ్చి విజయవాడ వచ్చారు. ఆ తర్వాత డబ్బులు అడిగితే ఇవ్వకుండా తిట్టడం ప్రారంభించాడు.

December 6, 2024 / 07:31 AM IST

నూజండ్ల: రూ.6.83 లక్షల సరుకు సీజ్

PLD: నూజండ్లలోని హరిణి ఫర్టిలైజర్స్‌ షాపులో పురుగుమందుల విక్రయాలపై విజిలెన్స్‌ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అనుమతులు లేకుండా ఎరువులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. షాపులో పురుగుమందులు, ఎరువులు ఇన్వాయిస్లను, రిజిస్టర్లు, లైసెన్సులను పరిశీలించగా సరైన అనుమతి పత్రాలు లేవని నిర్థారణకు వచ్చారు. దీంతో రూ.6.83 లక్షల సరుకును సీజ్ చేశారు.

December 6, 2024 / 05:47 AM IST

అనారోగ్యంతో టీడీపీ కార్యకర్త మృతి

KDP: బి.కోడూరు మండలం మున్నెల్లి గ్రామ పంచాయతీ రాజుపాలెం గ్రామానికి చెందిన చర్మకారుల సంఘం అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు మున్నేల్లి కేశవ గురువారం అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ పెద్ద మరణించడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయనకు పలువురు టీడీపీ నాయకులు నివాళులర్పించారు.

December 6, 2024 / 04:03 AM IST

బాలికపై యువకుడి అత్యాచారయత్నం

AP: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం చెల్లెలి చెలిమలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. యువకుడిని పట్టుకుని బాలిక బంధువులు దేహశుద్ది చేశారు. అంతేకాకుండా యువకుడి ఇంటికి గ్రామస్తులు నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

December 6, 2024 / 01:22 AM IST

పోలీసులపై రాళ్లదాడి.. అధికారికి గాయాలు

ఇరానీ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేయటానికి వెళ్లిన పోలీసులపై రాళ్లు రువ్విన ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ముంబై పోలీస్ అధికారి గాయపడ్డారు. ఇరానీ గ్యాంగ్ సభ్యులు చైన్ స్నాచింగ్‌లతో పాటు పలు నేరాలకు పాల్పడ్డారు. వారిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు అంబివ్లీ ప్రాంతానికి వెళ్లగా.. వారిపై పలువురు గ్యాంగ్ సభ్యులు రాళ్లు విసిరారు. రాళ్లదాడికి పాల్పడిన వారిలో నలుగురిని అదుపులోకి తీస...

December 5, 2024 / 10:37 PM IST

యువకుడిని దారుణంగా హత్య చేసిన దుండగులు

SRPT: మఠంపల్లి మండలం భీమ్లా తండాకు చెందిన పానుగోతు పాచు అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అకారణంగా హత్య చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం మఠంపల్లి మండలంలోని సుల్తాన్పురం తండా సమీపంలో పానుగోతు పాచు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు చంపి రోడ్డు పక్కన పడేశారని తెలిపారు.

December 5, 2024 / 08:33 PM IST

రెండు బైకులు ఢీ ఇద్దరికి తీవ్ర గాయాలు

WGL: వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనలు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘట గురువారం రాయపర్తి మండలం కేంద్రంలోచోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారిపై ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మైలారం చెందిన బిక్షపతి, ఐనవోలు మండలం గర్నెపెల్లి చెందిన రాజేష్ అనే  వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

December 5, 2024 / 08:10 PM IST