SDPT: జిన్నారం మండలం బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో క్వారీ గుంతలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. జీఎంఆర్ కాలనీకి చెందిన చిట్యాల రఘు, చిట్యాల రవి స్నానం చేయడానికి క్వారీకి వెళ్లారు. ప్రమాదవశాత్తు రవి నీటి గుంతలో పడి మునిగిపోయాడు. గజ ఈతగాల్లతో వెతకించినా ఆచూకీ లభించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
VSP: అక్కయ్యపాలెంలో అంగన్వాడీ టీచర్ రహీమున్నీసాబేగంపై పెట్రోల్ దాడి ఘటనలో సంగీత అనే మహిళపై కేసు నమోదైంది. గోపాలపట్నంకి చెందిన సంగీత, రహిమున్నీసాబేగంకి రూ.35 వేలు అప్పుగా ఇచ్చింది. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో బుధవారం పెట్రోల్ తీసుకుని అంగన్వాడీ కేంద్రానికి వచ్చి దాడి చేసిందన్నారు.
అకస్మాత్తుగా భూమి కుంగిపోవటంతో 13 మంది గల్లంతైన ఘటన చైనాలోని షెంజెన్ సిటీలో జరిగింది. రైల్వే నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేలలోకి కూరుకుపోయిన కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అక్కడి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఘటనాస్థలానికి సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ప్రకాశం: త్రిపురాంతకం మండలం టి.చెర్లోపల్లి గ్రామానికి చెందిన రైతు పుచ్చకాయల కేశయ్య (50) పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కేశయ్య ఇంటికి రాకపోవడంతో పొలంకు వెళ్ళిచూడగా మృతిచెంది కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై శివబసవరాజు కేసు నమోదు చేశారు.
TG: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కు అల్లుఅర్జున్ రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి(39) అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్, కుమార్తె తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
KNL: బనగానపల్లె మండలంలోని యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో దైవదర్శనానికి వచ్చి బోయ సురేంద్ర యువకుడు ప్రమాదవశాత్తు కోనేరులో పడి మృతి చెందాడు. సురేంద్ర పెద్ద కోనేరులో దిగుతున్న క్రమంలో కాలు జారీ కోనేరులో పడి మృత్యువాత పడ్డాడు. మృతుని స్వగ్రామం గుంతకల్లు మండలం పాత చెరువు గ్రామంగా స్థానికులు గుర్తించారు.
NLG: ఇంట్లోకి జొరబడి ఒంటరిగా ఉన్న మహిళ మెడలో నుండి పుస్తెలతాడును లాక్కెళ్ళిన ఘటన బుధవారం చిట్యాలలో చోటుచేసుకుంది. చిట్యాల ఎస్సై ధర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని ఇద్దరు దొంగలు ఉరుమడ్ల రోడ్డులో గల చేపూరి ప్రేమలత ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కొట్టి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు పూసలతాడును లాక్కెళ్లారు.
NLG: ఇంట్లోకి జొరబడి ఒంటరిగా ఉన్న మహిళ మెడలో నుండి పుస్తెలతాడును లాక్కెళ్ళిన ఘటన బుధవారం చిట్యాలలో చోటుచేసుకుంది. చిట్యాల ఎస్సై ధర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని ఇద్దరు దొంగలు ఉరుమడ్ల రోడ్డులో గల చేపూరి ప్రేమలత ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కొట్టి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు.
AP: అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. రాయచోటిలో విద్యార్థులు టీచర్‌ను కొట్టి చంపారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు టీచర్ చాతిపై కొట్టడంతో ఉపాధ్యాయుడు ఏజాస్ క్లాస్‌రూమ్‌లోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది గమనించిన తోటి ఉపాధ్యాయులు ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. అల్లరి చేయొద్దని మందలించినందుకు దాడి చేసినట్లు తెలుస్తుంది. రాయచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్‌ల...
AP: గుంటూరు కాజా టోల్‌ప్లాజా దగ్గర ఎర్రచందనంను పోలీసులు పట్టుకున్నారు. లారీలో చెన్నై నుంచి విశాఖకు తరలిస్తున్న రెండున్నర టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. లారీలో పేపర్ బండిల్స్ మధ్య ఎర్రచందనం దుంగలు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే డ్రైవర్, క్లీనర్ లారీ వదిలి పారిపోయారు.
న్యూయార్క్‌లో దారుణం జరిగింది. అమెరికా ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ యునైటెడ్ హెల్త్‌కేర్ సీఈవో బ్రియాన్ థాంప్సన్ హత్యకు గురయ్యారు. మిడ్‌టౌన్‌లోని హిల్టన్ హోటల్ బయట ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ముఖానికి మాస్కుతో వచ్చిన దుండగుడు బ్రియాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం చోటుచేసుకుంది. కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుడిని చంపేశారు. ముగ్గురు తొమ్మిదో తరగతి విద్యార్థులు తరగతి గదిలోనే ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. దీంతో ఉపాధ్యాయుడు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఉపాధ్యాయుడిని ఆ విద్యార్థులు ఎందుకు చంపారనేది తెలియాల్సి ఉంది.
AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటుచేసుకుంది. కొత్తపల్లి హైస్కూల్లో ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందాడు. విద్యార్థులు అల్లరి చేస్తుండగా ఉపాధ్యాయుడు ఏజాస్ అహ్మద్ వారిపై కేకలు వేసాడు. ఆ సమయంలోనే ఆయన ఒక్కసారిగా తరగతి గదిలోనే కుప్పకూలాడు. వెంటనే రాయచోటి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
MDK: శివంపేట మండలం శభాష్ పల్లి గ్రామానికి చెందిన తల్లి కూతుర్లు పూజ (23), నిషిత (2) అదృశ్యమైనట్టు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పడుకున్న పూజ, నిశిత తెల్లవారుజామున కనిపించలేదని వివరించారు. చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదని వివరించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
కృష్ణా: విజయవాడ రాజీవ్ నగర్‌లో బుధవారం మధ్యాహ్నం మృతదేహం కలకలం రేపింది. నున్న పోలీసుల వివరాల మేరకు.. నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉందన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 50 వరకు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి మృతుడి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.