• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

ఉరివేసుకొని ఆర్మీ జవాన్ ఆత్మహత్య

AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కేఎన్ఆర్ లాడ్జిలో ఆర్మీ జవాన్ ఫ్యానుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు నాతవరం మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన బొత్సా శివ అప్పలనాయుడుగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

December 7, 2024 / 04:41 AM IST

కాలువలో వృద్ధుని మృతదేహం లభ్యం

కడప: ఖాజీపేట మండలం చెర్లోపల్లె గ్రామానికి వెళ్లే దారిలోని కాలువలో ఓ గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం నీటిలో తేలియాడుతూ ఉండటం స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి ఖాజీపేట మండలం అప్పనపల్లి వాసిగా నిర్ధారించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

December 7, 2024 / 04:33 AM IST

బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మహిళ అరెస్టు

VZM: పూసపాటిరేగ మండలం వెల్టురు గ్రామంలో బెల్ట్‌ షాప్న నడుపుతున్న అప్పాయమ్మ అనే మహిళలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి 22 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఆమెపై కేసు నమోదు చేసారు. ఎక్సైజ్‌ శాఖ సీఐ ఆధ్వర్యంలో పూసపాటిరేగ ఎక్సైజ్‌ ఎస్సై ఈ దాడులు నిర్వహించారు. అక్రమంగా మద్యం అమ్మకాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

December 7, 2024 / 04:21 AM IST

మహిళ మెడలో గొలుసు అపహరణ

W.G: తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలో చైన్ స్నాచింగ్ జరిగింది. తాళ్లపూడి ఎస్సై టి. రామకృష్ణ వివరాల మేరకు గ్రామంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న పట్నాల ఉమ మహేశ్వరావు భార్య లక్ష్మీ ఇంటి పెరట్లో పనులు చేస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి మెడలో గొలుసు తెంపు కొని వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

December 7, 2024 / 04:19 AM IST

పాత కక్షలతో దారుణ హత్య

KDP: చక్రాయపేట మండల పరిధిలోని గండికోవూరులో శుక్రవారం ఓ హత్య ఘటన కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న గ్రామం గండికోవూరులో తాజా హత్య ఘటనతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. హరిజనవాడకు చెందిన దండు యోగాంజనేయులు(38)పై నల్ల కదిరిగాళ్ల నాగార్జున తలపై కొయ్యతో కొట్టడంతో మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

December 7, 2024 / 04:06 AM IST

భారీగా బంగారం పట్టివేత

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు 999 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. ఇండోర్‌ నుంచి ఢిల్లీ వచ్చిన ప్రయాణికుడి లగేజీని  అధికారులు తనిఖీ చేశారు. ఎక్స్‌రేలో అనుమానాస్పద ఫొటోలు కనిపించడంతో బ్యాగును తెరచి చూశారు. ఈ క్రమంలో రూ.72.72 లక్షల విలువైన సుమారు కేజీ బంగారంను గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

December 7, 2024 / 04:05 AM IST

గండిలో గల్లంతైన యువకుడు

కడప: విహారయాత్రకు వచ్చి యువకుడు నీటిలో గల్లంతైన సంఘటన శుక్రవారం చెన్నూరు మండల పరిధిలోని వాటర్ గండి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కడప నగరం అశోక్ నగర్‌కు చెందిన దాట్ల మోహన్ 20మంది స్నేహితులతో కలిసి వాటర్ గండిలో సరదాగా ఈత ఆడుతుండగా.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చర్యలు చేపట్టారు.

December 7, 2024 / 04:02 AM IST

పెన్నా నది నీటిలో యువకుడు గల్లంతు

KDP: చెన్నూరు మండలంలోని ఓబులంపల్లె పంచాయతీ పరిధిలోని వాటర్ గండి వద్ద పెన్నా నది నీటిలో శుక్రవారం యువకుడు గల్లంతయ్యాడు. కడప పట్టణం అశోక్ నగర్‌కు చెందిన దాట్ల యోహన్ అనే యువకుడు విహారయాత్రకు వాటర్ గండి ప్రాంతానికి వచ్చాడు. నదిలో ఈత ఆడుతూ ప్రమాదవశాత్తు పెన్నా నది నీటిలో గల్లంతయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. 

December 7, 2024 / 04:00 AM IST

దొంగలు అరెస్ట్.. రూ.1.8 కోట్ల బంగారం స్వాధీనం

TG: వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్‌బీఐలో దోపీడీ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ, మహారాష్ట్రకు చెందిన ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో మరో ముగ్గురు దొంగలు ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రూ.1.8 కోట్ల విలువైన బంగారం, కారు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 18న రూ.13.61 కోట్ల విలువైన బంగారం చోరీ చేశారు.

December 7, 2024 / 02:16 AM IST

ఫార్మా కంపెనీలో స్వల్ప ప్రమాదం

AP: అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలోని కంపెనీలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. విజయశ్రీ ఫార్మా కంపెనీలో రసాయనాలు పడి ఇద్దరికి గాయాలయ్యాయి. ఆ ఇద్దరు కార్మికులను కంపెనీ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

December 7, 2024 / 12:30 AM IST

నర్సీపట్నం లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

AKP: నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఒక లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. నాతవరం మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన బొత్స శివ అప్పలనాయుడు అనే ఆర్మీ జవాన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం సాయంత్రం ఏడు గంటలకు లాడ్జిలో రూము తీసుకున్న అప్పలనాయుడు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు విగతజీవుడిగా కనిపించారు.

December 6, 2024 / 08:36 PM IST

మెట్రోస్టేషన్ వద్ద అగ్నిప్రమాదంలో కుట్రకోణం..!

HYD: మలక్‌పేట మెట్రోస్టేషన్ వద్ద అగ్నిప్రమాదం జరగడం నగరంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా కుట్రకోణం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి బైకులను తగలబెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. మెట్రోస్టేషన్ కింద పెట్రోల్ డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

December 6, 2024 / 08:27 PM IST

కొమ్మాలపాడు వద్ద రోడ్డు ప్రమాదం

ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని కొమ్మలపడు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ను ట్యాంకర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కరిముల్లాకు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 6, 2024 / 07:46 PM IST

దారుణం: ప్రిన్సిపల్‌ను కాల్చి చంపిన విద్యార్థి

విద్యాబుద్ధులు నేర్పిన ప్రిన్సిపల్‌ను ఓ విద్యార్థి కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఛతర్‌పుర్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సక్సెనా ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రోజుటి లాగే పాఠశాలకు వెళ్లిన సక్సెనాపై ఓ విద్యార్థి కాల్పులు జరపటంతో అక్కడికక్కడే మృతి చెందారు. విద్యార్థిని మందలించటంతో ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. కాల్పుల తర్వాత ఆ విద్యార్థి ప్రిన్సి...

December 6, 2024 / 07:41 PM IST

కత్తి దాడిలో గాయపడిన మహిళ మృతి

ప్రకాశం: గిద్దలూరులోని రజక బజారులో శుక్రవారం కత్తి దాడికి గురైన సుహాసి అనే మహిళ మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గుర్తు తెలియని వ్యక్తి సుహాసినిపై కత్తితో దాడి చేయడంతో స్థానికులు మొదట గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మార్కాపురం పంపారు.

December 6, 2024 / 06:30 PM IST