GNTR: జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. కొత్తపేట పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం హిందూ కాలేజీ పెట్రోల్ బంక్ వద్ద అపస్మారక స్థితిలో ఓ వ్యక్తి పడి ఉన్నాడు. పెట్రోల్ బంక్ సిబ్బంది గమనించి పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ సహాయంతో జీజీహెచ్ మార్చురీకి తరలించారు.