TG: వికారాబాద్ జిల్లాలోని తాండూర్ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఏసీబీ విచారణ జరుపుతోంది. సోమవారం సాయంత్రం రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏవో దానయ్య ఏసీబీ అధికారులకు చిక్కారు. దుద్యాలలో భూమి పట్టా కోసం అధికారులు లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకున్న కేసులో ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.