TTD: మరో బిడ్డకు ప్రాణం పోసిన పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రి
తిరుపతి(Tirupathi)లోని పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆస్పత్రి(Padmavathi childrens hospital) మరో బిడ్డకు ప్రాణం పోసింది. నెల రోజుల వ్యవధిలోనే రెండవ గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి అరుదైన రికార్డును నెలకొల్పింది. పక్కా ప్రణాళికతో గ్రీన్ ఛానల్ కూడా లేకుండా చెన్నైలో బ్రెయిన్ డెడ్(Brain Died) అయిన రెండేళ్ల బాలుడి గుండెను సేకరించి తిరుపతిలోని 13 ఏళ్ల పాపకు ప్రాణం పోసింది. ఈ విషయాన్ని టీటీడీ(TTD) ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
తిరుపతి(Tirupathi)లోని పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆస్పత్రి(Padmavathi childrens hospital) మరో బిడ్డకు ప్రాణం పోసింది. నెల రోజుల వ్యవధిలోనే రెండవ గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి అరుదైన రికార్డును నెలకొల్పింది. పక్కా ప్రణాళికతో గ్రీన్ ఛానల్ కూడా లేకుండా చెన్నైలో బ్రెయిన్ డెడ్(Brain Died) అయిన రెండేళ్ల బాలుడి గుండెను సేకరించి తిరుపతిలోని 13 నెలల పాపకు ప్రాణం పోసింది. ఈ విషయాన్ని టీటీడీ(TTD) ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన 13 నెలల పాపకు గుండె తీవ్రంగా దెబ్బతినడంతో మార్చాలని విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో వారి సూచన మేరకు టీటీడీ(TTD)కి చెందిన పద్మావతి చిన్న పిల్లల గుండె ఆస్పత్రి(Padmavathi childrens hospital)కి వచ్చారు. మూడు నెలల క్రితం ఆస్పత్రిలో పాపను అడ్మిట్ చేశారు. పాపకు సరిపోయే గుండె కోసం వైద్యుల్ జీవన్ దాన్ లో రిజిస్టర్ చేసి మందులతో పాప ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చారు.
చెన్నైలోని రెండేళ్ల పాపకు బ్రెయిన్ డెడ్ అయ్యిందనే వార్త తెలియడంతో ప్రత్యేక బృందంతో ఆపరేషన్ కు సిద్ధమయ్యారు. టీటీడీ(TTD) సహకారంతో అంబులెన్స్, మరో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని వైద్య బృందం రాత్రికే చెన్నై చేరుకోగా గ్రీన్ చానెల్ లేకుండా కేవలం 2.15 గంటల్లోనే గుండెను తిరుపతి ఆస్పత్రికి చేర్చారు. 4.30 గుండె మార్పిడి ఆపరేషన్(Heart Operation) చేసి విజయం సాధించారు. రూ 30 లక్షలు ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్సను టీటీడీ(TTD) ప్రాణదానం, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ పథకాల కింద ఉచితంగా చేసినట్లు టీటీడీ(TTD) ఈవో వెల్లడించారు. నెలరోజుల్లోనే రెండు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించడంతో వైద్యులను ఈవో ధర్మారెడ్డి అభినందించారు.