»Mi Grand Victory By Rcb Ipl 2023 Points Table 8 To 3 Mumbai Team
RCBపై MI గ్రాండ్ విక్టరీ..8 నుంచి 3కు చేరిన జట్టు
IPL 2023లో నిన్న రాత్రి 54వ మ్యాచులో ముంబై ఇండియన్స్(MI) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య జరిగిన మ్యాచులో ముంబై ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించి ఆరో విజయాన్ని సొంతం చేసుకుంది.
ముంబై ఇండియన్స్(Mumbai Indians) మంగళవారం వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో IPL 2023 పాయింట్ల పట్టికలో ముంబై జట్టు No.8 నుంచి ఏకంగా No.3కి దూసుకెళ్లింది. ముంబై ఇండియన్స్ 200 పరుగుల ఛేజింగ్‌తో ఆటను ప్రారంభించింది. ఆ క్రమంలో సూర్యకుమార్ యాదవ్(83), నేహాల్ వధేరా(52), ఇషాన్ కిషన్(42) స్కోర్ చేసి టీం గెలుపునకు కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సీజన్లో వీరు ఆరవ విజయాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో బెంగళూరు బౌలర్లలో వానిందు హసరంగా, విజయ్ కుమార్ వైశాఖ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
మే 3న ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ పంజాబ్ కింగ్స్(PBKS)పై 215 పరుగులను ఛేదించారు. ఆరు రోజుల తర్వాత అదే ఇద్దరూ మళ్లీ మ్యాచ్ విజయం కోసం ప్రధాన పాత్ర పోషించడం విశేషం.
అంతేకాదు సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 83 పరుగుల చేసి ఔట్ అయ్యాడు. ఈ ఐపిఎల్(ipl)లో అతనికి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఐపీఎల్లో వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించిన నెహాల్ వధేరా వారి ఆటను సిక్సర్‌తో ముగించారు.
ఇక మొదట బ్యాటింగ్ చేసిన RCB జట్టులో మాక్స్వెల్, డు ప్లెసిస్ తప్ప మిగతా ఆటగాళ్లు ఎవరూ కూడా పెద్దగా స్కోర్లు చేయలేదు. మ్యాక్స్‌వెల్ 33 బంతుల్లో 68 పరుగులు (స్ట్రైక్-రేట్ 206.06) చేయగా…డుప్లెసిస్ 41 బంతుల్లో 65 రన్స్ (SR: 158.53) చేయడంతో RCB మొత్తం 199/6 స్కోర్ చేసింది. ఆ నేపథ్యంలో MI బౌలర్ బెహ్రెన్‌డార్ఫ్ విరాట్ కోహ్లీతోపాటు మరో ఇద్దరిని ఔట్ చేసి బెంగళూరు స్కోరును కట్టడి చేశాడు.