»Massive Seizure Of Liquor And Cash Before The Mlc Elections Telangana
MLC elections:కు ముందే భారీగా మద్యం, నగదు పట్టివేత
తెలంగాణలో రేపు ఎమ్మెల్యే ఎన్నికలు(MLC elections) జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్యం, నగదు పట్టుబడింది. పోలీసులు, ఎక్సైజ్ బృందాల తనిఖీల్లో భాగంగా డ్రగ్స్, గంజాయితో పాటు 41 లక్షల నగదు, 1,800 లీటర్ల మద్యాన్ని అధికారుల స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పోలీసులు(police) 95 కేసులు నమోదు చేసి 74 మందిని అరెస్టు చేశారు.
తెలంగాణ(Telangana)లో ఎమ్మెల్సీ ఎన్నికలకు(MLC elections) ముందే డ్రగ్స్, గంజాయి, 1,800 లీటర్ల మద్యం(wine)తోపాటు 40 లక్షలకుపైగా నగదు(cash)ను పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్(hyderabad rangareddy mahabubnagar) ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ(mlc) ఎన్నికల నేపథ్యంలో ఇది చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం నేరుగా పోటీలో ఉన్న ఏ అభ్యర్థితోనూ సంబంధం లేదని…ఈ విషయంపై విచారణ చేస్తున్నట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
మరోవైపు మద్యం రవాణాకు సంబంధించి పోలీసులు(police) 95 కేసులు నమోదు చేసి 74 మందిని అరెస్టు చేశారు. అలాగే 101 మందిని బైండోవర్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, బ్యానర్లు, వాల్ పోస్టర్లపై సుమారు 5,800 కేసులు నమోదయ్యాయి. ఇటీవల తెలంగాణ మాదక ద్రవ్యాల నిరోధక విభాగం గంజాయిని స్వాధీనం చేసుకుంది. MDMA, హెరాయిన్ వంటి డ్రగ్స్ ను కూడా పట్టుకున్నారు.
ఎమ్మెల్సీ కట్టేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీ కాలం మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లకు పోలింగ్ రోజున ప్రత్యేక క్యాజువల్ సెలవులు ఇవ్వాలని సీఈవో(CEO) ఆదేశించారు. మార్చి 13న ఈ ఎన్నికలు జరగనుండగా, మొత్తం 29,720 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉపాధ్యాయుల నియోజకవర్గం తొమ్మిది జిల్లాల పరిధిలోకి వస్తుంది. మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్(hyderabad).
ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల కోసం 739 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు సీఈఓ(CEO) తెలిపారు. 137 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మరోవైపు ఈ ఎన్నికల పోటీలో 21 మంది అభ్యర్థులు ఉన్నట్లు వెల్లడించారు.