Amritpal Singh:ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్‌కు (Amritpal Singh)ను పోలీసులు అరెస్ట్ చేశారు. షాకొట్ వద్ద అమృత్ పాల్ (Amritpal Singh) లొకేషన్ ట్రేస్ చేసి.. జలందర్ నకొదర్ వద్ద 50 వాహనాలతో వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు.
Amritpal Singh:ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్‌కు (Amritpal Singh)ను పోలీసులు అరెస్ట్ చేశారు. షాకొట్ వద్ద అమృత్ పాల్ (Amritpal Singh) లొకేషన్ ట్రేస్ చేశారు. జలందర్ నకొదర్ వద్ద 50 వాహనాలతో వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు. అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) అనుచరులు దాడులు చేసే అవకాశం ఉంది.. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసే ఛాన్స్ ఉండటంతో పలు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థను ఏర్పాటు చేసి.. ఖలిస్తాన్ అనుకూల భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నాడు. తన కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నించడంతో పోలీసులు అతడిపై నిఘా పెట్టి.. అరెస్ట్ చేశారు. ఇటీవల అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) తనను అరెస్ట్ చేయాలని పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో పోలీసులు వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్.. అతని అనుచరులను జలంధర్‌లో అరెస్ట్ చేశారు. అమృత్ పాల్ అరెస్ట్ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వంతో కేంద్ర హోం శాఖ సంప్రదింపులు జరిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశీతంగా గమనిస్తోంది.
అమృత్ పాల్‌ను (Amritpal Singh) ఐఎస్ఐ బ్రిందాన్వాలె 0.2గా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని పేర్కొన్నాయి. జర్నాలీ సింగ్ బ్రిందాన్ వాలె సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఖలిస్థాన్ కావాలని పోరాడారు. 1984లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’లో (operation blue star) చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమృత్ పాల్ సింగ్‌ను బ్రిందన్ వాలె 0.2గా ప్రమోట్ చేస్తోందని. . అందుకోసం నిధులు అందజేస్తోందని సమాచారం.
ఇటీవల అజ్నాలాలో అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) అనుచరుడు లవర్ ప్రీత్ సింగ్ తుపాన్, (lover preeth singh) పంజాబ్ పోలీసులు (punjab police) మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అతని మద్దతు దారులు కత్తులు, తుపాకులు తీసుకొని పోలీసు బారికేడ్లను చేదించి మరీ అజ్నాలా (ajnala) పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. పోలీసులు తమను ఏమీ చేయొద్దని గురు గ్రంథ్ సాహిబ్‌ను (guru granth sahib) అడ్డు పెట్టుకున్నారని పోలీసులు తెలిపారు. అది వారి పవిత్ర గ్రంథం కావడంతో.. పోలీసులు తమను ఏమీ చేయరని రెచ్చిపోయారని చెబుతున్నారు. గొడవ నేపథ్యంలో లవర్ ప్రీత్ తుఫాన్‌ను (lover preeth singh) పోలీసులు అరెస్ట్ చేసి.. ఆ తర్వాత విడుదల చేశారు. ఇప్పుడు అమృత్ పాల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.