Jogini: పురాణాల్లో శ్రీ రేణుక ఎల్లమ్మ చరిత్ర నుంచే ఈ జోగిని వ్యవస్థ ఉందని ప్రముఖ జోగిని షర్మిల రెడ్డి(Transgender Sharmila Reddy)తెలిపారు. గోలెం(లంద)లో దాగి ఉన్న ఎల్లమ్మను బయటకు రప్పించడానికి కొడుకైన పరుశురాముడు తన చెల్లికి ఈ జోగిని వేశం కట్టిస్తాడు. అలా ఈ జోగిని వ్యవస్థ మొదలైంది. బోనాల సమయంలో జోగినిలది చాలా ముఖ్యపాత్ర ఉంటుంది. నిత్యం దైవారాధనలో ఉంటారు. బోనాలను స్త్రీల కన్నా చక్కగా అలంకరిస్తారు. జోగినీలు బోనం చేసి ఎత్తుకుంటే చాలా మంచిదని అందరు భావిస్తారు. కాబట్టి బోనాలు అంటే వీరికి స్పెషల్ అన్నారు. ఇక జోగినీలు బోనం చేసే ప్రక్రియ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని వివరించారు.
ఆషాడ మాసంలో చేసే బోనాలకు సాధరణ సమయంలో చేసే బోనాలకు చాలా తేడా ఉన్నట్లు తెలిపారు. పుట్టుకతో మగాడిగానే ఉన్నా పెరగితరణంలో వారిలో వచ్చే కీలకమైన మార్పులను, అలాగే వారికి సర్జరీ ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాలను షర్మిలారెడ్డిని జోగిని పేర్కొన్నారు. సమాజంలో నవ్వుతూ కనిపించే చాలా మంది జీవితంలో కష్టాలు ఉన్నట్లే ట్రాన్స్ జెండర్ల జీవితంలో కూడా ఉండే ఇబ్బందుల గురించి తెలిపారు. ముఖ్యంగా హిజ్రాలకు, జోగినీలకు ఉండే తేడాను వెల్లడించారు. ఈ వీడియో గురించి ఇంకా మరింత సమాచారం తెలియాలంటే పూర్తి వీడియో తెలియాల్సిందే.