Cm Jaganతోనే ప్రయాణం.. పార్టీ వీడేదిలేదు: మేకపాటి విక్రమ్ రెడ్డి
మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు, ఆత్మకూర్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పార్టీ మార్పు అంశం చర్చకు వచ్చింది. దీనిపై ఆయన స్పందించారు. తన ప్రయాణ సీఎం జగన్‌తోనే విక్రమ్ రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ వీడేది లేదని.. పుకార్లను నమ్మొద్దని కోరారు.
Mekapati Vikram Reddy:మేకపాటి (Mekapati) కుటుంబం వరసగా వార్తల్లోకి వస్తోంది. చంద్రశేఖర్ రెడ్డి (chandrashekar reddy) ఇష్యూ ఉండగా.. మేకపాటి రాజమోహన్ రెడ్డి (mekapati rajamohan reddy) కుమారుడు, ఆత్మకూర్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి (Mekapati Vikram Reddy) అంశం తెరపైకి వచ్చింది. ఆయన పార్టీ వీడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన స్పందించారు. తన ప్రయాణ సీఎం జగన్‌తోనే (cm jagan) అని స్పష్టంచేశారు. పార్టీ వీడేది లేదని.. పుకార్లను నమ్మొద్దని కోరారు.
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. ఆ తర్వాత తమతో 50 మంది (50 mlas) వరకు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని టీడీపీ నేతలు (tdp leaders) కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే విక్రమ్ రెడ్డి (vikram reddy) పార్టీ మారుతున్నారని ప్రచాం జరుగుతుంది. ఇవీ ఊహాగానాలేనని.. పుకార్లను నమ్మొద్దని విక్రమ్ రెడ్డి కోరారు. సీఎం జగన్ ఫ్యామిలీ (jagan family) తమ కుటుంబానికి అనుబంధం ఉందన్నారు.
సీఎం జగన్‌కు (jagan) మద్దతుగా తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి (mekapati rajamohan reddy) రెండుసార్లు ఎంపీ పదవీకి రాజీనామా చేశారని ఆయన గుర్తుచేశారు. తన సోదరుడు గౌతమ్ రెడ్డి (gautham reddy) చనిపోయిన తర్వాత సీఎం జగన్ (jagan) పిలిచి సీటు ఇచ్చారని పేర్కొన్నారు. ఏ విషయం అయినా సరే ముందు సీఎం జగన్‌తో (jagan) మాట్లాడుతానని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అన్నీ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని చెప్పారు.
విక్రమ్ రెడ్డి బాబాయ్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని (mekapati chandrashekar reddy) పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారని వేటు వేశారు. ఇప్పుడు విక్రమ్ రెడ్డి అంశం కూడా జోరుగా ప్రచారం జరుగగా.. ఆయన ఖండించారు.