ministersపై సీఎం జగన్ సీరియస్.. పనితీరు మారకుంటే వేటు తప్పదు..!!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కొందరిపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నారని హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. గత నెల 14వ తేదీన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారని ఆమె తెలిపారు.
CM Jagan:ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కొందరు మంత్రులపై (ministers) సీఎం జగన్ (CM Jagan) సీరియస్‌గా ఉన్నారట. ఈ విషయాన్ని హోం మంత్రి తానేటి వనిత (taneti vanita) తెలిపారు. గత నెల 14వ తేదీన మంత్రివర్గ సమావేశం (cabinet meet) జరిగిన సంగతి తెలిసిందే. ఆ రోజు సీఎం జగన్(CM Jagan).. మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు తెలిసింది. పనితీరులో మార్పు లేకుంటే పదవీ ఉండదని.. దూకుడుగా ఉండాలని జగన్ (CM Jagan) చెప్పారట. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా జగన్ మంత్రులతో చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఒకరిద్దరు మంత్రులను (ministers) మార్చేందుకు వెనకాడడోమని సీఎం జగన్ (CM Jagan) సమావేశంలోనే స్పష్టంచేశారట. ఏడాదిలో ఎన్నికలు ఉన్నందున.. అంతా యాక్టివ్‌గా ఉండాలని నిర్దేశం చేశారని తెలిసింది. ఏమరుపాటుగా ఉన్నవారిపై వేటు తప్పదని చెప్పారని వనిత (vanita) తెలిపారు. దీంతో ఆ మంత్రులు ఎవరు? వేటు తప్పదా అనే చర్చ జరుగుతుంది.
జగన్ (CM Jagan) ముఖ్యమంత్రి పదవీ చేపట్టిన తర్వాత ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగింది. సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రుల కేటాయింపు జరిగింది. మరోసారి విస్తరణ ఉంటదు అని.. ఉండదను రకరకాల ప్రచారం జరుగుతుంది. కొందరు ఆమాత్య పదవీపై ఆశ పెట్టుకున్నారు. దానికితోడు.. ఇప్పుడు పనిచేయని కొందరిపై వేటు వేయాలని సీఎం జగన్ (CM Jagan) అనుకుంటున్నారట. మంచి టీమ్‌తో కలిసి ప్రజల్లోకి వెళ్లాలని.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేందుకు వ్యుహారచన చేస్తున్నారు.