ఈరోజు వ్యాపార వైఫల్యం, నష్టాలు, ఆపద భయం, సోమరితనం, ఖర్చులు చూస్తారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత వ్యాపారంలో విజయం, గుర్తింపు లభిస్తుంది. దీంతోపాటు పోటీలో పరీక్షలలో విజయం, సంతోషం లభిస్తుంది. మరోవైపు శారీరక సుఖం లేకపోవడం, అశాంతి, అలసత్వం కనిపిస్తాయి.
మిథునం
ఈరోజు వ్యాపారాలలో విజయం, గుర్తింపు, ఆరోగ్యం, సంపద, బంధుమిత్రులతో సంబంధాలు, విజయాలు లభిస్తాయి. సాయంత్రం అయిదు గంటల తర్వాత వ్యాపారంలో ఇబ్బందులు, అశాంతి, మానసిక ఒత్తిళ్లు, ఆపద భయం, కడుపునొప్పి, ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణ ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉంది.
కర్కాటకం
వ్యాపారంలో అపజయం, మానసిక ఒత్తిడి, చిత్త నష్టం, ప్రమాద భయం, నష్టాన్ని చూస్తారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత వ్యాపారంలో విజయం లభిస్తుంది. దీంతోపాటు ఈరోజు అనుకూలమైన స్థల మార్పు, పదోన్నతి, ఆరోగ్యం, ఇష్టమైన ఆహారం సమృద్ధిగా లభించే ఛాన్స్ ఉంది.
సింహం
ఈరోజు వ్యాపార విజయం, ధన సేకరణ, బంధువులతో సహవాసం, ఇష్టమైన ఆహారం సమృద్ధి, గుర్తింపును చూస్తారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత వ్యాపారంలో అపజయం, గర్వం కోల్పోవడం, మానసిక ఒత్తిడి, ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మరోవైపు కలహాలు, శత్రుత్వం వంటివి కూడా కనిపిస్తాయి.
కన్య
వ్యాపారంలో ఆటంకాలు, శారీరక గాయాలు, సోమరితనం, ఖర్చు భయం, ఆపద, నష్టాలు ఉంటాయి. సాయంత్రం ఐదు గంటల తర్వాత వ్యాపారంలో విజయం, పరీక్షలలో విజయం సాధిస్తారు. ఇష్టమైన ఆహారంతోపాటు ఆరోగ్యం సమృద్ధిగా ఉంటుంది.
తులారాశి
వృత్తిలో విజయం, సంతోషం, పరీక్షలో విజయం, ప్రమోషన్ కనిపిస్తుంది. సాయంత్రం అయిదు గంటల తర్వాత వ్యాపారంలో అపజయం, ఖర్చులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి, శారీరక ఆరోగ్యం బాగాలేకపోవడం, ప్రయాణ సమస్యలు, పరీక్షల్లో అపజయం వంటివి కనిపిస్తాయి.
వృశ్చికం
వ్యాపారాలలో విజయం, పోటీ పరీక్షల్లో కూడా నెగ్గె అవకాశం ఉంటుంది. ఆహార ఎంపిక విషయంలో జాగ్రత్త వహించండి. మరోవైపు స్నేహం, ఆరోగ్యం, సంపద వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు
ఈరోజు వ్యాపారంలో అపజయం, గర్వం కోల్పోవడం, ఆపద భయం, శత్రుత్వం వంటివి చూస్తారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత వ్యాపారంలో విజయం, గుర్తింపు లభిస్తుంది. దీంతోపాటు ఆహార సమృద్ధి, ఊహించని ధనలాభం కూడా కనిపిస్తుంది.
మకరం
ఈరోజు మీకు ఆటంకాలు, నష్టాలు, గర్వం కోల్పోవడం, చిత్త నష్టం, అశాంతి వంటివి కనిపిస్తాయి. సాయంత్రం ఐదు గంటల తర్వాత అనుకూల, ప్రతికూలతల కలబోతలు ఉంటాయి.
కుంభం
వ్యాపారాలలో విజయం, పోటీలో విజయం, స్నేహం, ఆహారం సమృద్ధిగా కనిపిస్తుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత వ్యాపారంలో అపజయం, ఆపద భయం, నష్టాలు, వస్తువులు పోగొట్టుకోవడం వంటివి కనిపిస్తాయి. ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి. మనస్సు, శరీరం మధ్య సమతుల్యతను కనుగొనడంలో మీ శక్తిని ఉపయోగించుకోండి.
మీనరాశి
వ్యాపార విజయాన్ని, గుర్తింపును, కార్యసాధనలో పోటీ విజయాన్ని చూస్తారు. చర్చలు సఫలం కాగలవు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ వారం మీకు ఉత్తమమైన నిర్ణయాలలో ఒకటి జరుగుతుంది. తేలికపాటి నడకకు వెళ్లండి, ధ్యానం చేయండి లేదా మీకు సంతోషాన్ని కలిగించే పనులు చేయండి.