»Dozens Of Pigs Died Is The Virus The Cause At Makthal Mahabubnagar
Pigs Died: పదుల సంఖ్యలో పందులు మృతి..వైరస్సే కారణం?
ఒక్క రోజే ఏకంగా ఐదు పందులు మృతి(pigs died) చెందాయి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా(mahabubnagar district) మక్తల్(makthal) మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. దీంతో అక్కడి ప్రజల్లో భయాందోళన మొదలైంది.
గత కొన్ని రోజులుగా పందులు ఆకస్మాత్తుగా మరణిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్క రోజే ఏకంగా ఐదు పందులు మృతి(pigs died) చెందాయి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా(mahabubnagar district) మక్తల్(makthal) మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. దీంతో అక్కడి ప్రజల్లో భయాందోళన మొదలైంది. ఏదైనా కొత్త వైరస్ కారణంగా పందులు మృతి చెందాయా లేదా పరిసరాల అపరిశుభ్రత వంటి కారణాలతో మరణించాయా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో వరుసగా పందులు మరణించడంతో వాటిని వెంటనే తొలగించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి నుంచి వచ్చే దుర్వాసనను తట్టుకోలేక పోతున్నామని అంటున్నారు. ఆ క్రమంలో వాటి నుంచి వచ్చిన వ్యాధి ఏదైనా ఉంటే తమకు సోకే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు అధికారులు కాలనీలలో వసతులు కల్పిచడం సహా ప్రజల ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు(local people) నిరాశ చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా మక్తల్లో పదుల సంఖ్యలో పదులు చనిపోవడం పట్ల ప్రజలు(people) అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇంకోవైపు పక్కనే ఉన్న కర్ణాటకలోని దేవసుగురు ప్రాంతంలో సైతం ఓ వైరస్ కారణంగా పందులు మృత్యువాత చెందాయి. ఇదే క్రమంలో మక్తల్లో ఆకస్మాత్తుగా పందుల మరణానికి కూడా ఆ వైరస్సే కారణమా అని అడుగుతున్నారు.
అంతకు ముందు యూపీలోని లక్నోలో సైతం మూడు రోజుల్లో తెలియని కారణాలతో రెండు పందుల ఫారాల్లో 87 పందులు మృతి(pigs died) చెందాయి. అయితే వాటిలో కొన్ని పక్షవాతం వచ్చినట్లు మృతి చెందినట్లు నిపుణులు చెప్పారు. కానీ మరికొన్ని మాత్రం దోమలు, చీడపీడల నివారణకు కాలువల్లో రసాయనాలు చల్లడం వల్లే ఈ మరణాలు సంభవించి ఉంటాయని వెల్లడించారు. ఏదైనా వ్యాధి కారణంగా మృతి చెంది ఉంటే వాటికి రక్త పరీక్షల అనంతరం ఖచ్చితమైన కారణాలు వెల్లడిస్తామని పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్పారు. అనంతరం ఆరోగ్య శాఖ అధికారులు(officers) రంగంలోకి దిగి వాటిని పరిశీలించారు. మృతదేహాలను వెలికితీసి చనిపోయిన పందులను పూడ్చిపెట్టారు.