VSP: విశాఖపట్నం 12వ వార్డులో ఆరిలోవ దరి శ్రీకాంత్ నగర్లో పార్క్ చేసి ఉన్న లారీ బుధవారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైయింది. ఆరిలోవ ఎస్సై కృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని, అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే లారీ చాలా వరకు కాలిపోయింది. కాగా ఇది షార్ట్ సర్క్యూటా.. లేక ఆకతాయిల పనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.