విశాఖ మద్దిలపాలెంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, స్కూటీ ఒకే దిశలో వెళ్తుండగా, స్కూటీ అదుపుతప్పి పల్సర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీ నడుపుతున్న వ్యక్తి బస్సు వెనుక చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

