AP: అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. రాయచోటిలో విద్యార్థులు టీచర్‌ను కొట్టి చంపారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు టీచర్ చాతిపై కొట్టడంతో ఉపాధ్యాయుడు ఏజాస్ క్లాస్‌రూమ్‌లోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది గమనించిన తోటి ఉపాధ్యాయులు ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. అల్లరి చేయొద్దని మందలించినందుకు దాడి చేసినట్లు తెలుస్తుంది. రాయచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో ఘటన చోటుచేసుకుంది.