»Commencement Of New Academic Year Release Of Academic Calendar
TS School Academic Calendar : విద్యాసంవత్సరం ప్రారంభం..అకడమిక్ క్యాలెండర్ విడుదల
2024 ఏప్రిల్ 24 నుంచి 2024 జూన్ 11వ తేది వరకు వేసవి సెలవుల(Summer Holidays)ను విద్యాశాఖ ప్రకటించింది. 2024 జనవరి 10న పదో తరగతి సిలబస్ పూర్తిచేసి, SSC బోర్డ్ ఎగ్జామినేషన్ లోపల రివిజన్ క్లాసులు, ప్రీ ఫైనల్ పరీక్షలు కంప్లీట్ చేయనున్నారు.
2023-24 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరానికి గాను 1 నుంచి 10వ తరగతులకు అకడమిక్ క్యాలెండర్(TS School Academic Calendar)ను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారంగా చూస్తే 2023 జూన్ 12న పాఠశాలలు ప్రారంభమవుతాయి. 2024 ఏప్రిల్ 23న విద్యా సంవత్సరం ముగియనుంది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులపాటు స్కూల్స్ నడవనున్నాయి.
2024 ఏప్రిల్ 24 నుంచి 2024 జూన్ 11వ తేది వరకు వేసవి సెలవుల(Summer Holidays)ను విద్యాశాఖ ప్రకటించింది. 2024 జనవరి 10న పదో తరగతి సిలబస్ పూర్తిచేసి, SSC బోర్డ్ ఎగ్జామినేషన్ లోపల రివిజన్ క్లాసులు, ప్రీ ఫైనల్ పరీక్షలు కంప్లీట్ చేయనున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ అనంతరం అన్ని తరగతుల్లో 5 నిమిషాలపాటు యోగా సెషన్ నిర్వహించనున్నారు. 2023 జూన్ 6 నుంచి 2023 జూన్ 9 వరకు బడిబాట కార్యక్రమం చేపట్టనున్నారు.
ఇకపోతే పరీక్షల విషయానికి వస్తే.. ఫార్మేటివ్ అసెస్మెంట్ (FA)-1 పరీక్షలను ఈ ఏడాది జూలై 31కి, ఫార్మేటివ్ అసెస్మెంట్ (FA)-2 పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ 30కి, సమ్మేటివ్ అసెస్మెంట్ (SA)-1 పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 11 వరకు నిర్వహించనున్నారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ (FA)-3 పరీక్షలను డిసెంబర్ 12 లోపు, ఫార్మేటివ్ అసెస్మెంట్ (FA)-4 పరీక్షలను 2024 జనవరి 29 లోపు నిర్వహించనున్నారు. 2024 ఏప్రిల్ 8 నుంచి 18వ తేది వరకు 1 నుంచి 9 తరగతులకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. SSC బోర్డు పరీక్షలను 2024 మార్చిలో నిర్వహించనున్నట్లు అకడమిక్ క్యాలెండ్(TS School Academic Calendar) ద్వారా ప్రకటించారు.