తెలంగాణ(Telangana)లో రానున్న మూడు నుండి ఐదు రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Weather station) తెలిపింది. ఇవాళ ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియన్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు పేర్కొంది. కర్ణాటక (Karnataka) వరకు సగటు సముద్ర మట్టానికి 0.9కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు పేర్కొంది. రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగాలులు వీచే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
మంగళవారం నుండి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్(Adilabad), కుమరం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem), ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటలలో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని తెలిపింది. రేపటి నుండి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఖమ్మం(Khammam), నల్గొండ, మహబూబాబాద్ పలు ప్రాంతాల్లో బుధవారం వడగాలులు వీస్తాయని వెల్లడించింది. గురు, శుక్రవారాల్లోను వివిధ ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.మరోవైపు వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు(Temperatures) గరిష్ఠంగా 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.