»Chandrababu Angry Over The Manner Of Mlc Elections
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై చంద్రబాబు ఆగ్రహం
ఏపీ(AP)లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) తీరుపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ(TDP) నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన చర్చలు జరిపారు. పోలింగ్ లో అక్రమాలు, వైసీపీ(YCP) దౌర్జన్యాలు, అక్రమ అరెస్టుల గురించి చంద్రబాబుకు పార్టీ నాయకులు వివరించారు.

టీడీపీ(TDP) నేతలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వైఎస్సార్, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) పోలింగ్ లో జరిగిన అక్రమాలు, ఉదయం నుంచి జరిగిన ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సుల్లో ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయించారని, ఇదంతా చూస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం మౌనంగా ఉందని చంద్రబాబు(Chandrababu) ఆరోపించారు.
పట్టభద్రలు ఓటు వేయాల్సిన ఈ ఎన్నికల్లో అనర్హులు, నిరక్ష్యరాస్యులతో వైసీపీ(YCP) నేతలు బోగస్ ఓట్లు వేయించారని చంద్రబాబు(Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చేసే ఫిర్యాదులను ఎన్నికల అధికారులు సీరియస్ గా తీసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో టీడీపీ(TDP) నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రకాశం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు(Chandrabu) తెలిపారు.