ADB: పత్తి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన గురువారం తెల్లవారుజామున ఆదిలాబాద్ రూరల్‌లో చోటుచేసుకుంది. బోరింగ్ గూడకు చెందిన రైతు కోడప లక్ష్మణ్ తన పత్తిని ట్రాక్టర్లో మార్కెట్ యార్డ్‌కు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో టేమ్రి గూడ బ్రిడ్జి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలవలేదని వెల్లడించారు.