E.G: నల్లజర్ల మండలం కవులూరులో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాసవి కాలేజీ బస్సు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.