NZB: బోధన్ చెక్కి క్యాంప్ శివారులో శనివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. పెంటాఖుర్దు నుంచి వస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి రోడ్డు కిందకు దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో కారులోని వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

