»Atchannaidu Comments On Tdp And Janasena Alliance
Atchannaidu: పొత్తులపై టీడీపీ ఏం చెబుతోంది…
ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ((YSR Congress Government) గద్దె దించడానికి తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే విషయాన్ని సరైన సమయంలో నిర్ణయిస్తామని తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు (Andhra Pradesh Telugudesam Party president) అచ్చెన్నాయుడు (atchannaidu) అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ((YSR Congress Government) గద్దె దించడానికి తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే విషయాన్ని సరైన సమయంలో నిర్ణయిస్తామని తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు (Andhra Pradesh Telugudesam Party president) అచ్చెన్నాయుడు (atchannaidu) అన్నారు. మంగళవారం ఉదయం వెంకటపాలెంలోని రెండు ఎన్టీఆర్ (NTR Statue) విగ్రహాలకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు (Telugu Desam Party MLAs and MLCs) పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పొత్తులపై సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుందన్నారు. జగన్ ప్రభుత్వాన్ని (YS Jagan Government) గద్దె దించాలనే దృఢ సంకల్పంతో జనసేన అధినేత (Jana Sena chief) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan కూడా ఉన్నారని, ఇందుకు ప్రజా స్వామ్యవాదులంతా ఏకం కావాలని టీడీపీ (TDP) – జనసేన (Janasena) పార్టీలు పిలుపునిస్తున్నాయన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ… చివరి బడ్జెట్ (Budget Sessions) సమావేశాల్లోనైనా వైసీపీ ప్రభుత్వం (YSRCP government), స్పీకర్ (Speaker) తీరు మారి ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల (Andhra Pradesh Assembly sessions)ను వైసీపీ నాయకులు వారి ఇష్టం వచ్చినట్టు తయారు చేశారన్నారు. గతంలో శాసనసభ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికగా చూశారని, గత నాలుగేళ్ల సమయంలో శాసనసభ నిర్వహణ చూస్తే తమకు ఎంతో బాధగా అనిపిస్తోందన్నారు. కనీసం ప్రతిపక్షాలు శాసనసభలో ఉన్నారని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను మాట్లాడనివ్వడం లేదని, మైక్ ఇవ్వడం లేదన్నారు. సొంత మీడియాను అడ్డు పెట్టుకొని, ఇష్టం వచ్చిన కంటెంట్ ను బయటకు ఇస్తారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రధానంగా పదిహేడు సమస్యలపై ప్రజలు బాధపడుతున్నారని, వీటిపై చర్చ జరగాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ అభ్యర్థిని పోటీలో పెట్టినట్లు చెప్పారు. రాజకీయాల్లో పొత్తులనేది సర్వసాధారణమన్నారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల మీదే పోరాడుతున్నారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులపై చంద్రబాబు చర్చించి, ప్రకటన చేస్తారన్నారు. తెలుగు దేశం పార్టీ 23 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి బీసీ మహిళను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపామన్నారు. తెలుగు దేశానికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారని సాక్షాత్తూ స్పీకర్ అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నారన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, 2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నాటికి టీడీపీ, బీజేపీతో కలిసి ముందుకు సాగాలని, అప్పుడే వైసీపీని ఓడించగలమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశ్వసిస్తున్నారు. కానీ టీడీపీతో కలిసేందుకు బీజేపీ ససేమీరా అంటోంది. టీడీపీకి బీజేపీ నో చెబుతుండటంతో… పవన్ ఏపీలో బలమైన టీడీపీతో వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. పొత్తులపై అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయి. ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. అందుకే బీజేపీ విషయంలో పవన్, టీడీపీ వెయిట్ అండ్ సీ పాలసీని అవలంభిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి.