»Another Important Development In The Tspsc Paper Leak Case
TSPSC: పరీక్షల్లో ఎలక్ట్రానిక్ డివైజ్‌లు.. వెలుగులోకి సంచలన విషయాలు
తెలంగాణలో సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పరీక్షల్లో నిందితులు ప్రశాంత్, నవీన్, మహేష్ ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించినట్లు సిట్ పోలీసులు గుర్తించారు.
TSPSC: తెలంగాణలో సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పరీక్షల్లో నిందితులు ప్రశాంత్, నవీన్, మహేష్ ఎలక్ట్రానిక్ పరికరాల(electronic devices)ను వినియోగించినట్లు సిట్(SIT) పోలీసులు గుర్తించారు. ఏఈఈ(AEE) పరీక్షలో ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించిన ముగ్గురు వ్యక్తులను ఇటీవల అరెస్టు చేశారు. డీఈ రమేష్(DE Ramesh) నుంచి ఏఈఏ పేపర్ కొనుగోలు చేసిన ముగ్గురు నిందితులు ఎలక్ట్రానిక్ పరికరంతో పరీక్ష రాసినట్లు విచారణలో తేలింది. సిట్ ఇప్పటికే రమేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రమేశ్ వరంగల్(warangal) జిల్లా విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా.. ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నపత్రాలను ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన రవికిషోర్ తీసుకెళ్లినట్లు గుర్తించారు. ప్రశ్నపత్రాలను రమేష్ మరో ఇరవై మందికి విక్రయించినట్లు సిట్ పోలీసుల విచారణలో తేలింది. దీంతో రమేష్‌ను వరంగల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రమేష్ కనుసన్నల్లో పెద్దఎత్తున ఏఈ పేపర్లు(AE Papers) చేతులు మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రమేష్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడికి వచ్చిన అభ్యర్థులతో టచ్ లో ఉంటూ ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఏఈ పరీక్షల్లో టాపర్లను సిట్ అధికారులు ప్రశ్నించగా.. ఏ ప్లస్ బీ(A+B)2 అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోయారు. పరీక్షల్లో టాప్ మార్కులు సాధించిన వారిని సిట్ అధికారులు విచారించనున్నారు. అయితే పేపర్ లీక్ కేసులో సిట్ ఇప్పటివరకు 45 మందిని అరెస్ట్ చేసింది. వీరిలో కొందరు బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినప్పటికీ రోజుకో కొత్త కోణం బయటపడుతోంది.
ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్. టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రాలు అందిన తర్వాత టీఎస్పీడీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ సురేష్‌ను మధ్యవర్తిగా చేసుకున్నాడు. ఏఈఈ/డీఏవో ప్రశ్నపత్రాలను 25 మందికి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. డీఈ రమేష్ కొన్ని ప్రశ్నపత్రాలను తీసుకుని సురేష్ ద్వారా విక్రయించినట్లు తెలుస్తోంది. మరికొందరు అభ్యర్థుల నుంచి ఏఈఈ, డీఏవో(DAO) ప్రశ్నపత్రాలు అడగాలని ఒత్తిడి వచ్చింది. దీంతో టెక్నాలజీ ద్వారా సమాధానాలు చెప్పేందుకు డీఈ ఏడుగురు అభ్యర్థులతో ఒక్కొక్కరికి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వారికి ముందుగానే మైక్రోఫోన్లు(MICRO PHONES) ఇచ్చాడు. అభ్యర్థులు వాటిని బెల్ట్‌లో భద్రపరిచి పరీక్ష హాలుకు చేరుకున్నారు. అభ్యర్థులు అక్కడున్న ఇన్విజిలేటర్ సాయంతో ప్రశ్నపత్రాల ఫొటోలు తీశారు. వాటిని పరీక్ష ప్రారంభానికి 10 నిమిషాల ముందు వాట్సాప్‌లో రమేష్‌కు ఫార్వార్డ్ చేశారు. చాట్ జీపీటీ ద్వారా సమాధానాలు సేకరించి పరీక్ష హాలులో ఉన్న ఏడుగురు అభ్యర్థులకు వాట్సాప్ ఫోన్ కాల్ ద్వారా సమాధానాలు ఇచ్చాడు. ఎగ్జామ్ హాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లేందుకు సహకరించిన ఇన్విజిలేటర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.