ఐపీఎల్(IPL 2023)కు కేఎల్ రాహుల్(KL Rahul) దూరం కానున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow SuperGiants) కెప్టెన్ అయిన రాహుల్ ఈ ఐపీఎల్ లోని మిగిలిన మ్యాచ్‌లు ఆడనని స్వయంగా తెలిపాడు. అలాగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(Test Championship Final) మ్యాచ్‌కు కూడా దూరం అవ్వనున్నాడు. కేఎల్ రాహుల్ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతుండగా గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంగా అతనికి తొడకండరాలు పట్టేసినట్లు తెలిపాడు.
విపరీతమైన నొప్పితో రాహుల్(KL Rahul) బాధపడుతున్నట్లు తెలిపాడు. ఆర్సీబీ(RCB)తో లక్నో(Lucknow SuperGiants) జట్టు తలపడుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ మ్యాచ్ ఆఖర్లో బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన రాహుల్ సింగిల్ కూడా తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. వైద్య బృందంతో సంప్రదింపులు చేసిన తర్వాత వారు శస్త్ర చికిత్స చేయించుకోవాలని తెలిపారు. దీంతో ఇకపై జరిగే ఐపీఎల్ మ్యాచులకు రాహుల్ దూరం కానున్నట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు.
కొన్ని వారాల్లోనే తాను కోలుకునేందుకు ప్రయత్నిస్తానని, ఫిట్ నెస్‌పై దృష్టి పెడుతానని కేఎల్ రాహుల్(KL Rahul) తెలిపాడు. లక్నో జట్టులో ఉండకపోవడం బాధాకరంగా ఉందని, జట్టులోని మిగిలిన ఆటగాళ్లంతా తమని తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపాడు. లక్నో(Lucknow SuperGiants) ఆడే అన్ని మ్యాచులను తాను చూస్తానని అన్నాడు. తనకు మద్దతుగా నిలిచిన లక్నో మేనేజ్మెంట్, బీసీసీఐ(BCCI)కి, అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. త్వరలోనే మరింత బలంగా, ఫిట్ నెస్‌తో తిరిగి గ్రౌండ్లోకి చేరుకుంటానని కేఎల్ రాహుల్ వెల్లడించాడు.