WNP: అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నట్లు ఆత్మకూరు ఎస్సై నరేందర్ తెలిపారు. శనివారం రాత్రి మండల పరిధిలోని తిప్పడం పల్లి గ్రామంలో ఊక చెట్టు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు డయల్ 100 నంబర్‌కు ఫోన్ రావడంతో ఎస్సై ఆదేశానుసారం కానిస్టేబుల్ సురేందర్ ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.