ELR: కైకలూరుకి చెందిన నాదెళ్ల వెంకటేశ్(28) తల్లితో కలిసి ఇండియన్ బ్యాంకు సమీపంలో నివసిస్తున్నారు. మద్యానికి బానిసైన వెంకటేష్ తరచూ తాగి ఇంటికి వస్తుండటంతో తల్లి తాగొద్దని మందలిస్తూ ఉండేది. సోమవారం కూడా తాగి రావడంతో తల్లి అసహనం వ్యక్తం చేసింది. దీంతో వెంకటేశ్ ఇంట్లో ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్మ చేసుకున్నాడు.