VZM: బొబ్బిలి మండలం దిబ్బగుడ్డివలస గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై బొబ్బిలి ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి, పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 35,200 నగదు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ వెల్లడించారు.