TPT: వడమాలపేట టోల్ ప్లాజా వద్ద సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఐచర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 450 బస్తాలు (25 టన్నులు) రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై హరీష్ తెలిపారు. పుత్తూరు నుంచి రేణిగుంట వైపు వెళుతుండగా వడమాలపేట టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.