తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) మరో 3 రోజుల పాటు వర్షాలు(Rain) కురవనున్నట్లు వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ(AP), తెలంగాణ(Telangana)లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గురు, శుక్ర, శనివారాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. మంగళవారం తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు అనేక జిల్లాల్లో భారీ వర్షం కురిసిందని, రికార్డు స్థాయిలో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
మరో మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు(Rain) పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా 27 జిల్లాల్లో వర్షాలు పడతాయని, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ(Weather Department) వెల్లడించింది.
ఏపీలో రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు(Rain) మూడు రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. ఏపీలోని అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకకుళం, తూర్పుగోదావరి, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద ఎవ్వరూ ఉండొద్దని అధికారులు సూచించారు.