E.G: రాజానగరం మండలం చక్రద్వారబంధంలో బుధవారం సాయంత్రం ఎలక్ట్రికల్ బైక్ దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతు చిక్కాల రాఘవ ఏడాది క్రితం రాజమండ్రిలోని ఓ షోరూంలో ఎలక్ట్రికల్ బైక్ కొనుగోలు చేశారు. ఈక్రమంలో పొలం నుంచి ఇంటికి వస్తుండగా సీటు కింద ఉన్న బ్యాటరీ నుంచి శబ్దం వచ్చింది. ఆగి చూసేసరికి ఒక్కసారిగా మంటలు ఎగసి క్షణాల్లోనే కాలిబూడిదైందని బాధితుడు వాపోయారు.